📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబాపు బాగున్నావా...! అని ఆప్యాయంగా పలకరించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

బాపు బాగున్నావా…! అని ఆప్యాయంగా పలకరించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, మే 9 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుగ్గిళ్ళ, తిమ్మాయిపల్లి గ్రామాలలో శనివారం పర్యటనకి విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నీ తిమ్మాయిపల్లి గ్రామ సర్పంచ్ దానబోయిన సత్తవ్వ -పోచయ్య ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న పంట సాగు, సాగునీటి సమస్యలు,ధాన్యం కొనుగోలు ఇబ్బందులపై ఆయన ఆరా తీశారు.రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతులకు తగిన మద్దతు అందించాలని ప్రభుత్వాన్ని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాకాల మాహిపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎలా శేఖర్ బాబు, దేవన బోయిన నరేందర్, గ్రామ ప్రజలు రైతులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular