📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణNalgonda11 వ తేదీ నుంచి ఇంటింటి జనగణన ప్రారంభం

11 వ తేదీ నుంచి ఇంటింటి జనగణన ప్రారంభం

📰 Generate e-Paper Clip

*11 వ తేదీ నుంచి ఇంటింటి జనగణన ప్రారంభం*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

భారత జనగణన 2027 లో భాగంగా మున్సిపాలిటీ పరిధిలో ఈనెల 11వ తేదీ నుంచి మొదటి దశ ఇండ్ల జాబితా ఇండ్ల గణన సమాచార సేకరణ కార్యక్రమం ప్రారంభం కానుందని మున్సిపల్ అధికారులు శుక్రవారం తెలిపారు. జూన్ 9 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో నియమితులైన ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు ప్రజలకు సూచనలు జారీ చేశారు. ఎన్యూమరేటర్లు అడిగే ప్రశ్నలకు సరైన సమాచారం అందించి జనగణన విజయ వంతానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ గుర్తింపు కార్డులతోనే ఎన్యూమరేటర్లు ఇంటింటికి వస్తారని తెలిపారు. జనగణన లో భాగంగా స్యీయగణన కోసం ఏర్పాటు చేసిన ఆన్లైన్ పోర్టు లో కూడా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కల్పించామని పేర్కొన్నారు. ప్రజలు ముందుగానే ఆన్లైన్ లో నమోదు పూర్తి చేసి పొందిన ఐడి ని ఎన్యూమరేటర్లు చూపించాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular