📄 ePaper
Wednesday, July 1, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriనూతన వధువరులను ఆశీర్వదించిన ఎంపీ ఈటెల రాజేందర్

నూతన వధువరులను ఆశీర్వదించిన ఎంపీ ఈటెల రాజేందర్

📰 Generate e-Paper Clip

 

ఘట్‌కేసర్, మే 7 (ప్రజావాణి): మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ సోదరుడు భాస్కర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్ వివాహం శ్రీజతో ఇటీవల ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గురువారం ఘనపురం గ్రామంలోని భాస్కర్ గౌడ్ నివాసానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, సుఖసంతోషాలతో జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఘట్‌కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ వేముల మమత గౌడ్, మాజీ ఉపసర్పంచ్ వేముల పరమేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వేముల రాజు గౌడ్, నాయకులు కట్కూరి భాను గౌడ్, వేముల నవీన్ గౌడ్, వేముల విక్రమ్ గౌడ్, యువ నాయకుడు వేముల మణి శరణ్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular