నూతన వధువరులను ఆశీర్వదించిన ఎంపీ ఈటెల రాజేందర్

  ఘట్‌కేసర్, మే 7 (ప్రజావాణి): మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ సోదరుడు భాస్కర్ గౌడ్ కుమారుడు అభిషేక్ గౌడ్ వివాహం శ్రీజతో ఇటీవల ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గురువారం ఘనపురం గ్రామంలోని భాస్కర్ గౌడ్ నివాసానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటెల రాజేందర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి, సుఖసంతోషాలతో జీవితం కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఘట్‌కేసర్ మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్...