📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ఏదైనా ఆపద వస్తే ఇల్లే పదిలం అంటారు అలాంటి ఇల్లు దాటి వచ్చి మహిళల...

ఏదైనా ఆపద వస్తే ఇల్లే పదిలం అంటారు అలాంటి ఇల్లు దాటి వచ్చి మహిళల మెడలో పుస్తెలతాళ్లు గొలుసులు తెగిపోతుంటే మహిళలకు భద్రత ఎక్కడ,,భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ,

📰 Generate e-Paper Clip

గుంటూరు జిల్లా ప్రజావాణి న్యూస్ (మే04) వినుకొండ పట్టణంలోని భవన్నారాయణ స్వామి దేవాలయం పక్క బజారులో నిన్న రాత్రి ఆరు గంటల 30 నిమిషాల సమయంలో అడ్డగిరి లక్ష్మీ కుమారి అనే వృద్ధురాలు ఆమె భర్త 72 ఏళ్ల వయసు గల ఇద్దరు ఒక చిన్న గృహంలో నివాసం ఉంటున్నారు వారు కాలక్షేపానికి పిల్లలు తిని వస్తువుల్ని అమ్ముకుంటూ ఉంటారు ఆ సమయంలో ఉరుములు మెరుపులు వస్తుండడంతో వారి గేటు వేసుకొని ఇంట్లో ఉన్న వృధా దంపతుల ను ఏదో కావాలన్నట్టు పిలిచి వారి కళ్ళు కారం జల్లి ఆమె మెడలో ఉన్న ఎనిమిది తులాల బంగారపు చేయను గొలుసును తెంచుకొని వెళ్లినట్టు వారు కేకలు వేసుకుంటూ బయటకు వచ్చారని అప్పటికే దొంగ పారిపోయాడని తెలిసి ఈరోజు ఉదయం 10:30 నిమిషాలకు వృద్ధ దంపతులు ఇంటి వద్దకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ పట్టణ సమితి బృందం అక్కడికి వెళ్లి వారితో మాట్లాడక వారి ఆవేదన అంతా వింత కాదు మేము నిరుపేదలమని పిల్లలపైన ఆధారపడకుండా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మేమేదో పిల్లలకి చిన్న చిన్న తినుబండారాలు అమ్ముకొని ఒకరిని ఆశించకుండా జీవిస్తున్నామని మా వయసును కూడా చూడకుండా మాపై దాడి చేసి ఎన్నో ఏళ్లుగా నా ఒంటి మీద ఉన్న బంగారాన్ని దుండగుడు తెంచుకొని వెళ్ళాడని మా వస్తువుని కాపాడుకోవడానికి మేము సర్వ ప్రయత్నం చేశామని మాకు వయసు సహకరించ లేదని కన్నీరు మున్నేరు అయ్యేలా వారు రోదిస్తున్నారు వారి ఆవేదన చూసిన ప్రతి ఒక్కరికి కడుపు తరుక్కుపోతుంది వారిని ఓదారుస్తూభారత కమ్యూనిస్టు పార్టీ.సిపిఐ వినుకొండ పట్టణ కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ గత రెండేళ్లుగా వినకొండ లో మహిళలను టార్గెట్ చేస్తూ మహిళల మెడలో ఉన్న గొలుసులను దొంగతనం చేస్తున్నారని.ఈ దొంగల్ల బారిన పడి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయిన సంఘటన కూడా మనకు తెలుసు ఈ దొంగతనాలు ఈ విధంగా కొనసాగుతూనే ఉంటే మహిళలు రోడ్ల పైన తిరగాలన్న తిరగలేని పరిస్థితులు మహిళలకు రక్షణ ఎక్కడ అది దాటి ఇళ్లల్లో ఉన్న మహిళలపై కూడా ఈ కేటుగాళ్లు దాడులు చేస్తుంటే మహిళలు ఏ విధంగా రక్షించాలో రక్షించబడతారు మాకు అర్థం కావట్లేదు వినుకొండకు సంబంధించిన వ్యక్తులు చేస్తున్నారా లేక బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఈ ఘాతకానికి పాల్పడుతున్నారనేది అర్థం కాని విషయం వెంటనే పోలీసు అధికారులు వీరిపై ఉక్కు పాదం మోపి ఇంకొకసారి వినుకొండలో దొంగతనం చేయాలంటేనే వెన్నులో వణుకు పుట్టాలని ఆ విధంగా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని వినుకొండ ప్రజలంతా తమ వెంట ఉంటారని లేనిచో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ వినుకొండ ప్రజలను ఏకం చేసి పోరాట బాట పట్టాల్సి వస్తుందని అధికారులను రాము హెచ్చరించారుఈ బృందంలో పాల్గొన్న సిపిఐ నాయకులు.నర్రా వెంకటరత్నం.దుర్గారెడ్డి.షేక్ ఇబ్రహీం.బొల్లాపల్లి నాగూర్. బాలకృష్ణ.చీరాల బ్రహ్మేంద్ర. పవన్ కుమార్.సైదా వలి.వెంకటేష్ తదితరులు ఈ బృందంలో ఉన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.