బెజ్జంకి, మే 4 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని కల్లెపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దారం తిరుపతి రెడ్డి తనయుడు డాక్టర్ అశోక్ రెడ్డి (ఎంఎస్ ప్లాస్టిక్ సర్జన్, కరీంనగర్) పేద విద్యార్థులను ప్రోత్సహించే గొప్ప కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించారు.తాజా పదో తరగతి ఫలితాల్లో 528 మార్కులు సాధించి పాఠశాలలో మొదటి స్థానం పొందిన ZPHS-కల్లెపల్లి విద్యార్థిని బండి తేజశ్రీ (బండి రాములు కుమార్తె)కు రూ.10,000 నగదు ప్రోత్సాహకంగా అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థిని ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవసరమైన సహాయాన్ని అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొని డాక్టర్ అశోక్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.




