పేద విద్యార్థులకు ప్రోత్సాహం 10వ తరగతి టాప్ సాధించిన విద్యార్థినికి రూ.10,000

  బెజ్జంకి, మే 4 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని కల్లెపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దారం తిరుపతి రెడ్డి తనయుడు డాక్టర్ అశోక్ రెడ్డి (ఎంఎస్ ప్లాస్టిక్ సర్జన్, కరీంనగర్) పేద విద్యార్థులను ప్రోత్సహించే గొప్ప కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించారు.తాజా పదో తరగతి ఫలితాల్లో 528 మార్కులు సాధించి పాఠశాలలో మొదటి స్థానం పొందిన ZPHS-కల్లెపల్లి విద్యార్థిని బండి తేజశ్రీ (బండి రాములు...