📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఉయ్యాల"రేషన్ దందూకుడు పెంచిన "దా..గోడమీద పిల్లిలా "గోపి"@రేషన్ మాఫియా చాపకింద నీరులా విస్తరణ.కొండపల్లి కేంద్రంగా బలపడుతున్న...

ఉయ్యాల”రేషన్ దందూకుడు పెంచిన “దా..గోడమీద పిల్లిలా “గోపి”@రేషన్ మాఫియా చాపకింద నీరులా విస్తరణ.కొండపల్లి కేంద్రంగా బలపడుతున్న అక్రమ వ్యాపారం.అయ్యా శంకరా.ఇతను మరో షాడో డాన్…!

📰 Generate e-Paper Clip

 

ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 02) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యాన్నికాంగ్రెస్ నేత అనుచరుడి కుటుంబం కీలక పాత్రలో ఉందా.అంతర్గత విభేదాలు.బయటపడుతున్న అసలు ముఖాలు.గోపి శ్రీను పైకి శత్రువులా నటిస్తూ.లోపల వ్యాపార భాగస్వాములా.సంచి ఒకటి.రుకు మరొకటి.మోసాల మాస్టర్ ప్లాన్ రేషన్ బియ్యం“రీ-సైక్లింగ్”మరి కొందరు షాడో రేషన్ డాన్లు,ఏరియాకో వ్యక్తి.మాఫియా జాలం విస్తరణ.నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి.అధికార వ్యవస్థపై ప్రజల అనుమానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని అక్రమార్కుల బారిన పడకుండా ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా,రేషన్ మాఫియాను పూర్తిగా కట్టడి చేయలేకపోతున్నది.ఎక్కడో ఒకచోట అవినీతి కొనసాగుతూనే ఉంది.ముఖ్యంగా మైలవరం నియోజకవర్గంలో ఈ మాఫియా గ్యాంగ్‌పై అధికారులు చెక్ పెట్టడంలో విఫలమయ్యారు.గత నెలలో కొండపల్లి ప్రాంతానికి చెందిన కొందరిపై పలు పత్రికల్లో కథనాలు వచ్చినా,రేషన్ దందా ఆగకుండా కొనసాగుతోంది.వీర్లపాడు మండలంలో ఒక లేడీ డాన్ రంగప్రవేశం చేసిందనే సమాచారం కూడా వినిపిస్తోంది.అక్రమ రేషన్ వ్యాపారానికి అలవాటు పడిన కుటుంబాలు ఈ వ్యాపారాన్ని వదులుకోవడం కష్టమే.కేసులు,పీడీ యాక్టులు,జైలు శిక్షలు కూడా వీరికి పెద్దగా భయం కలిగించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.రేషన్ వ్యాపారంలో అంత ఆదాయం ఉందా?అన్న ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది.అయ్యా శంకరా.ఇతను మరో షాడో డాన్..కాంగ్రెస్ నేత అనుచరుడి కుటుంబం కీలక పాత్రలో ఉందా.రేషన్ దందాలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడి అనుచరుడి కుటుంబం పాత్ర ఉందనే సమాచారం బయటకు వస్తోంది. కొండపల్లిలో జనరల్ స్టోర్ నిర్వహిస్తున్న ఈ వ్యక్తి, జిల్లా స్థాయి కాంగ్రెస్ నాయకుడికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతున్నట్లు చెబుతున్నారు. పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని కిలో రూ.16కి కొనుగోలు చేసి,కోళ్ల ఫారాలు మరియు ఇతర రాష్ట్రాల కూలీలకు కిలో రూ.30కి అమ్ముతున్నట్లు సమాచారం.అంతర్గత విభేదాలు.బయటపడుతున్న అసలు ముఖాలు.గోపి శ్రీను: శత్రువులా నటిస్తూ.వ్యాపార భాగస్వాములా.ఇబ్రహీంపట్నం ప్రాంతంలో షాడో డాన్ గోపి  దౌర్జన్యాలు,బెదిరింపులు పెరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సస్పెక్ట్ షీటర్లు, రౌడీలు, నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులతో కలిసి డీలర్లను,వ్యాపారులను భయపెట్టి రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం ఇతని విధానంగా మారిందని స్థానికులు చెబుతున్నారు.ఇబ్రహీంపట్నంలో గోపి,కొండపల్లిలో శ్రీను  బయటకు శత్రువుల్లా కనిపించినా,లోపల వ్యాపారాన్ని కలిసి నడుపుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి నెల 24వ తేదీ నుంచి వీరి కార్యకలాపాలు మొదలై,మూడో తేదీ నాటికి ముగుస్తున్నట్లు సమాచారం. వీరిపై కేవలం నిఘా కాకుండా,బైండోవర్ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.సంచి ఒకటి.సరుకు మరొకటి.మోసాల మాస్టర్ ప్లాన్ రేషన్ బియ్యం రీ-సైక్లింగ్ బియ్యం బస్తాల పేరుతో ఇసుక, మట్టి సరఫరా చేసి కోళ్ల ఫారం యజమానులను మోసం చేయడం, రేషన్ బియ్యాన్ని రీసైకిల్ చేసి మళ్లీ మార్కెట్లోకి పంపడం ఈ డాన్ ప్రత్యేకతగా మారింది.ఈ ఏడాది ఇప్పటికే ఈ డాన్‌పై పలు కేసులు నమోదైనట్లు సమాచారం. అయినా అక్రమాలు ఆగకపోవడం అధికారులకు సవాలుగా మారింది.మరి కొందరు షాడో రేషన్ డాన్లుఏరియాకో వ్యక్తి.మాఫియా జాలం విస్తరణ.ఇబ్రహీంపట్నం, కొత్తూరు,మూలపాడు,ఈలప్రోలు,గుంటుపల్లి వర్క్‌షాప్ రోడ్ వంటి ప్రాంతాల్లో ఒక్కో వ్యక్తి రేషన్ దందాలో చురుకుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వీరంతా ప్రధాన డాన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఏప్రిల్ మొదటి వారంలో గుంటుపల్లి, ఈలప్రోలు ప్రాంతాల్లో కొంతమంది వ్యాపారుల వద్ద నుంచి రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.ప్రజలు ప్రభుత్వాన్ని, అధికారులను ఈ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు నిజాలు ఎప్పుడూ చేదుగానే ఉంటాయి.  అధికార వ్యవస్థపై ప్రజల అనుమానాలు అధికార పార్టీలతో సంబంధాలు కలిగిన కొందరు వ్యక్తులు తమ అనుచరులు, బంధువుల ద్వారా రేషన్ దందా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.అడ్డుగా వచ్చే వారిపై దౌర్జన్యాలకు కూడా పాల్పడుతున్నారనే విమర్శలు ఉన్నాయి.ముఖ్యంగా ఇబ్రహీంపట్నం మండలంలోని డీలర్ల వద్ద ఉండాల్సిన రేషన్ బియ్యం ఏమైందన్నది అధికారులు, ప్రభుత్వం తేల్చాల్సిన కీలక అంశంగా మారింది.ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా,రేషన్ మాఫియా రూపం మారుతూ కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.పేదల హక్కులను కాపాడాలంటే,ఈ అక్రమ వ్యాపారంపై కఠిన చర్యలు తప్పనిసరి అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.