📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamజిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాలు పాటించేది ఎన్నడు..?

జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాలు పాటించేది ఎన్నడు..?

📰 Generate e-Paper Clip

గ్రీవెన్స్ దరఖాస్తుకు ఐదు నెలలు పొద్దు గడిచే.?

జిల్లా పంచాయతీ అధికారుల ఆదేశాలు పాటించేది ఎన్నడు..?

గ్రీవెన్స్ దరఖాస్తుకు ఐదు నెలలు పొద్దు గడిచే.?

ప్రజా పాలన 99 రోజుల కార్యక్రమంలో కూడా అమలుకు నోచుకోని దరఖాస్తు

ఐదు నెలల్లో రెండు విచారణలు.. షోకాజ్ నోటీస్ లతో సరి

*చింతకాని మండల పంచాయతీ అధికారిని తీరుపై బాధితుల అసహనం

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి గ్రామంలో 2009 2010 సంవత్సరంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి ఆ తరువాత మరో పంచాయతీ కార్యదర్శి తాజా పంచాయతీ కార్యదర్శి వ్యవహారంపై నేలకొండపల్లి మండలం చెరువు మాదారం గ్రామానికి చెందిన బాధితులు నవంబర్ 24 2025 సంవత్సరంలో నాటి కలెక్టర్కు గ్రీవెన్స్ లో దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో మన ప్రజావాణి తెలుగు దినపత్రిక గత కొన్ని నెలలుగా సంచలన కథనాలు అందిస్తున్న సంగతి ఖమ్మం జిల్లా అధికారులకు పాఠకులకు తెలిసిందే. ఈ నేపథ్యంలో నాటి కలెక్టర్ పందిళ్ళపల్లి వ్యవహారంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నాటి పంచాయతీ కార్యదర్శులు ఇష్టానుసారంగా అడ్డగోలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని వార్త కథనాలను పరిగణలోకి తీసుకొని సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈ ఏడాది జనవరి ఫిబ్రవరి నెలలో జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయం తో పాటు జిల్లా కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో రెండు దశల్లో విచారణ చేసి విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నాటి పంచాయతీ కార్యదర్శి ప్రస్తుత మధిర మండలంలోని మాటూరు గ్రామపంచాయతీ కార్యదర్శి బండి నాగేంద్రబాబుకు షోకాజ్ నోటీస్ జాబ్ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించినప్పటికీ సదరు పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఓ నెల రోజుల తర్వాత లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై జిల్లా పంచాయతీ అధికారులు మరో మారు చింతకాని ఎంపీ ఓ కు ఆదేశాలు జారీ చేసి ఐదు రోజుల్లో నివేదిక అందించాలని ఆదేశించినప్పటికీ నెల రోజులు పైగా అవుతున్నప్పటికీ సంబంధిత పంచాయతీ అధికారిని నిర్లక్ష్యంగా వ్యవహరించి జిల్లాస్థాయి అధికారి ఆదేశాలను పెద్దగా పట్టించుకోలేదని విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఈ వ్యవహారంపై మన ప్రజావాణి తెలుగు దినపత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో ప్రతినిధి సదరు పంచాయతీ అధికారిని వివరణ కోరగా ఇంకేమీ విచారణ డిపిఓ సార్ రెండుసార్లు విచారణ చేశారు. అంటూ అందిన ఆదేశాలను సైతం పెదగా పట్టించుకోలేదని బాధితులు సైతం ఆరోపిస్తున్నారు. కాగా సదరు అధికారిని చింతకాని మండలానికి సంవత్సరం బదిలీపై వచ్చి పంచాయతీ సరిహద్దులు సైతం తెలవదని పలువురు మండల ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయా గ్రామాలలోని ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు పలుమార్లు సదరు అధికారానికి ఫోన్ చేసినప్పటికీ కనీసం ఫోన్ లైన్లో కూడా అందుబాటులోకి రారని ఆరోపణలు ఉన్నాయి. కాగా పందిళ్ళపల్లి వ్యవహారంపై జిల్లా పంచాయతీ అధికారి రాంబాబును మన ప్రజావాణి తెలుగు దినపత్రిక ప్రతినిధి వివరణ కోరగా మంత్రి గారి మీటింగులో ఉన్నామని జిల్లా కార్యాలయంలోని ఏవో ను సంప్రదించాలని రిపోర్టు అందజేసింది చెయ్యంది సమాచారం లేదని అన్నారు. ఇదే వ్యవహారంపై జిల్లా పంచాయతీ కార్యాలయంలోని ఏవో రాజేశ్వర్ ను సంప్రదించగా ఓ మేడం సెలవు పెట్టారు. రిపోర్టు సబ్మిట్ చేసింది చేయనిది సమాచారం లేదని శనివారం వివరాలు వెల్లడిస్తామని అన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఐదు నెలల క్రితం ప్రజావాణిలో బాధితులు అందించిన దరఖాస్తుకు మోక్షం కలిగించి విధులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు ఒక ప్రకటనలో కలెక్టర్ ను వేడుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular