సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు.
సమావేశం ఉద్దేశించి మాట్లాడిన బూర్గంపాడు మండల భారత కమ్యూనిస్టు పార్టీ (CPI ) మండల కార్యదర్శి సపకం నాగేశ్వరావు.
బూర్గంపాడు మండలం / మన ప్రజావాణి మే :1
భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అనుబంధ సంఘమైన ఏఐటియుసి ఆధ్వర్యంలో వాడవాడల మేడే ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. ఏ ఐ టీ యూ సి
మండల కార్యదర్శి సపకం.నాగేశ్వరావు సమావేశాన్ని ఉద్దేశించి
మాట్లాడారు. మండలంలోని 18 పంచాయతీలలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు . కార్మిక హక్కులను కాపాడుకోవడం కోసం 140 సంవత్సరాలుగా పోరాడుతున్న పాలకులు మాత్రం
నిమ్మకు నీరేత్తినట్టుగా తమ చేతిలో బలం ఉందని చెప్పేసి పార్లమెంట్లో బిజెపి ప్రతిపక్ష సభ్యులు పార్లమెంట్లో లేని సమయంలో 44 లేబర్ కోడ్లను రద్దు చేసి , కేవలం నాలుగు 4 లేబర్ కోడ్లను మాత్రమే తీసుకొచ్చి కార్మిక వర్గంతో చెలగాటమాడుతుందన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న కార్మికులు కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాల్సిన సమయం ఆసన్నమైంది అన్నారు.
కార్మికులు తమ హక్కులను కాపాడుకోవడం కోసం అందరూ ఒక తాటిపైకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్పొరేట్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడి కార్మికులందరూ తమ హక్కులను కాపాడుకోవాలని అన్నారు.
కార్యక్రమంలో సి పి ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి సభ్యులు పేరాల శ్రీనివాసరావు , బూర్గంపాడు మండల సహాయ కార్యదర్శి పాండవుల బిక్షం, కార్యవర్గ సభ్యులు నలజాల సత్యనారాయణ, సొల్లు పుల్లయ్య, సిద్ధార్థ సుబ్బారెడ్డి, నాయకులు , కుంజ నాగరాజు , భూక్యా నాగేశ్వరావు, సోయం విజయబాబు , రెంటాల తిరుతపయ్య , జారే ఆనంద్ సోయం నాగేశ్వరరావు, ముసిక మధుబాబు , ఎడమ భద్రయ్య , ఇర సుబ్బరాజు,మరియు 18 గ్రామ శాఖల కార్యదర్శులు , మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మేడే ఉత్సవాలు.
RELATED ARTICLES

