📄 ePaper
Saturday, June 27, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetపదవ తరగతిలో అగ్రశ్రేణిగా నిలిచిన విద్యార్థినులను ఘనంగా సన్మానించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు...

పదవ తరగతిలో అగ్రశ్రేణిగా నిలిచిన విద్యార్థినులను ఘనంగా సన్మానించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్

📰 Generate e-Paper Clip

 

బెజ్జంకి, ఏప్రిల్ 30(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివి అద్భుత ఫలితాలు సాధించిన.ఐలేని శ్రీజా రెడ్డి (560/600), బండిపల్లి వైష్ణవి (577/600) మార్కులు బెజ్జంకి మండలంలో అగ్రశ్రేణిగా నిలిచిన విద్యార్థులకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ శుభాకాంక్షలు తెలిపి  సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ మాట్లాడుతూ, విద్యార్థులు పట్టుదలతో చదివితేనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. మండలానికి గర్వకారణంగా నిలిచిన ఈ విద్యార్థినులు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, ఆలయ మాజీ చైర్మన్ జెల్ల ప్రభాకర్, వార్డు సభ్యులు బోనగం రమేష్, శనగొండ శ్రావణ్, మండల నాయకులు గుబిరే కిషన్, చెరుకూరి నర్సయ్య, కత్తి రమేష్ గౌడ్, గుబిరే చంద్రం, సంఘ రమేష్, జంగిటి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular