పదవ తరగతిలో అగ్రశ్రేణిగా నిలిచిన విద్యార్థినులను ఘనంగా సన్మానించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్
బెజ్జంకి, ఏప్రిల్ 30(ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదివి అద్భుత ఫలితాలు సాధించిన.ఐలేని శ్రీజా రెడ్డి (560/600), బండిపల్లి వైష్ణవి (577/600) మార్కులు బెజ్జంకి మండలంలో అగ్రశ్రేణిగా నిలిచిన విద్యార్థులకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ శుభాకాంక్షలు తెలిపి సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఒగ్గు దామోదర్ మాట్లాడుతూ, విద్యార్థులు పట్టుదలతో చదివితేనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని పేర్కొన్నారు. మండలానికి గర్వకారణంగా నిలిచిన ఈ విద్యార్థినులు భవిష్యత్తులో...