📄 ePaper
Monday, May 11, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetవైభవంగా లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదర్శన

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదర్శన

📰 Generate e-Paper Clip

వైభవంగా లక్ష్మీనరసింహస్వామి గిరి ప్రదర్శన

బెజ్జంకి,ఏప్రిల్ 30(ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి, సందర్భంగా నిర్వహించిన గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.భక్తులు భారీగా తరలివచ్చి గిరి ప్రదక్షిణలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు, యువత, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొనడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.ప్రతి నెల జయంతి వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులకు బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్, ఆలయ చైర్మన్ జెల్లా ప్రభాకర్ కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular