📄 ePaper
Thursday, May 14, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetగాగిల్లాపూర్ జడ్పీఎస్‌ఎస్ విద్యార్థుల ప్రతిభకు ఘన సన్మానం

గాగిల్లాపూర్ జడ్పీఎస్‌ఎస్ విద్యార్థుల ప్రతిభకు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎన్నుకొని ముందుకు సాగాలి – గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి -రాజు

బెజ్జంకి,ఏప్రిల్ 30(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ జడ్పీఎస్‌ఎస్ పాఠశాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. 522 మార్కులు సాధించిన గూడూరు సుచందన, 518 మార్కులు సాధించిన కె. సింధుజతో పాటు మరో ముగ్గురు విద్యార్థులను సర్పంచ్ ఎర్రల జానకి రాజు, ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, జిపి కార్యదర్శి పాము రాజేంద్రప్రసాద్ కలిసి శాలువాలు కప్పి అభినందించారు.ఈ సందర్భంగా విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం, వార్డు సభ్యులు సొల్లు బాలయ్య, న్యాలం శారద, కళ్ళపెళ్లి లక్ష్మి, తడకపల్లి పవన్, పైడిపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular