📄 ePaper
Saturday, April 25, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamపందిళ్ళపల్లి వ్యవహారంలో ముఖం చాటేసిన మాటూరు పంచాయతీ కార్యదర్శి  రోజుకు మూడుసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి...

పందిళ్ళపల్లి వ్యవహారంలో ముఖం చాటేసిన మాటూరు పంచాయతీ కార్యదర్శి  రోజుకు మూడుసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాని అవినీతిపంచాయతీ కార్యదర్శి జిల్లాస్థాయి అధికారులకు తెలియపరచిన చింతకాని ఎంపిఓ నివేదిక ఇచ్చినట్లు సమాచారం నిజమేనా

📰 Generate e-Paper Clip

పందిళ్ళపల్లి వ్యవహారంలో ముఖం చాటేసిన మాటూరు పంచాయతీ కార్యదర్శి.

రోజుకు మూడుసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాని అవినీతి పంచాయతీ కార్యదర్శి..?

జిల్లాస్థాయి అధికారులకు తెలియపరచిన చింతకాని ఎంపిఓ..?

నివేదిక ఇచ్చినట్లు సమాచారం నిజమేనా..?

ఆ వ్యవహారములో  ఇద్దరు పంచాయతీ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులతో పాటు తాజా పంచాయతీ కార్యదర్శి ప్రమేయం..?

విచారణ సమయంలో తాజా పంచాయతీ కార్యదర్శి ని  మందలించి రికార్డులు స్వాధీనం చేసుకున్న డిపిఓ..?

మన ప్రజావాణి కెమెరాలో నిక్షిప్తం..?

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

ఖమ్మం జిల్లా చింతకాని మండలం పందిళ్ళపల్లి సర్వేనెంబర్ 210 ఓ ప్లాట్ లో రేకుల షెడ్డు వ్యవహారం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సుమోటోగా స్వీకరించిన వ్యవహారం మూడు దశలుగా విచారణ చేశారని తెలిసింది. కాగా అవినీతి అక్రమాలకు పాల్పడిన మధ్యలో మండలం మాటూరు పంచాయతీ కార్యదర్శి బండి నాగేంద్రబాబు 2009 నుండి 2015 వరకు చింతకాని మండలం బందులపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహించిన వ్యవహారం ప్రభుత్వ ఘనంగాలు స్పష్టం చేస్తున్న వేళ. పందిళ్ళపల్లి గ్రామపంచాయతీ సాక్షిగా అనేక అక్రమాలకు పాల్పడినట్లు జిల్లా పంచాయతీ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ధ్రువీకరించిన నేపథ్యంలో సదరు అవినీతి పంచాయతీ కార్యదర్శి కి జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు షోకాజ్ నోటీసు జారీ చేసిన వ్యవహారంలో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జిల్లాస్థాయి అధికారుల ఆదేశాలను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి వ్యవహారంపై ఇటీవల మరో మారు జిల్లా పంచాయతీ అధికారి రాంబాబు చింతకాని పంచాయతీ అధికారికి ఓ లేఖను పంపించారు. ఈ లేఖ ప్రకారం ఐదు రోజుల్లో పందిళ్ళపల్లి పంచాయతీ రికార్డులను సమగ్రంగా పరిశీలించి విధుల పట్ల నిర్లక్ష్యంగా అవినీతికి పాల్పడిన మధిర మండలం మాటూరు పంచాయతీ కార్యదర్శి బండి నాగేంద్ర బాబుకు మరోమారు నోటీసు జారీ చేసి నివేదిక అందించాలని ఆదేశించారు. అయినప్పటికీ ఈ వ్యవహారంపై ఎంపీ ఓ నిర్లక్ష్యంగా  వుతీరినప్పటికీ నివేదిక అందించేందుకు కాలయాపన చేసినట్లు ఇటీవల మన ప్రజావాణి సంచలన కథనం అందించడంతో జిల్లా పంచాయతీ అధికారులతో పాటు ఉన్నతాధికారులు కన్నెర్రచేసినట్లు తెలిసింది. ఈ మేరకు సదరు చింతకాని ఎంపీ ఓ రోజుకు మూడు మార్లు ఫోన్లు చేసినప్పటికీ సదరు మధిర మండలం మాటూరు పంచాయతీ కార్యదర్శి నాగేంద్రబాబు స్పందించకపోవడంతో పంచాయతీ రికార్డుల ప్రకారం నివేదిక తయారుచేసి జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించినట్లు విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసింది. ఈ వ్యవహారంలో మాటూరు పంచాయతీ కార్యదర్శులతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న బత్తిన శ్రీనివాసరావు అనే సదరు ఎంపీ ఓ కీలక పాత్ర పోషించినట్లు సదరు ఇద్దరు ఉద్యోగులతో పాటు ప్రస్తుతం ఉన్న పంచాయతీ కార్యదర్శి ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు అధికారులు ధ్రువీకరించినట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ పంచాయతీ అధికారులు స్పందించి అవినీతి అక్రమాలకు పాల్పడిన పంచాయతీ కార్యదర్శి పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు ఒక ప్రకటనలో కోరుతున్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular