బెజ్జంకి, ఏప్రిల్ 25(ప్రజావాణి)
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా నూతన రాష్ట్ర కమిటీని శుక్రవారం ప్రకటించారు.ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు కరివేద మైపాల్ రెడ్డి ను కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచంద్రరావు తెలిపారు.ఈ సందర్భంగా మైపాల్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు కేంద్ర మంత్రులు బండి సంజయ్ కుమార్, కిషన్ రెడ్డి, అలాగే కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వ లక్ష్మి నర్సయ్య,రాష్ట్ర కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.కరివేద మైపాల్ రెడ్డి రెండవసారి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టడం పట్ల రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

