📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కడప జిల్లాలో ఏపీటీపీసీకి చెందిన స్థలం కోసం చర్చలు,,చైర్మన్ వజ్జ బాబూరావు బృందం..!

కడప జిల్లాలో ఏపీటీపీసీకి చెందిన స్థలం కోసం చర్చలు,,చైర్మన్ వజ్జ బాబూరావు బృందం..!

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్23) ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ (ఏపీటీపీసీ) కు కడప జిల్లాలో గతంలో ప్రభుత్వం వద్ద కొనుగోలు చేసిన స్థలాన్ని కార్పొరేషన్ కి అప్పజెప్పలని ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు బృందం జిల్లా కలెక్టర్‌ డా.శ్రీధర్ చెరుకూరి తో సమావేశమయి కోరారు.ఈ సందర్భంగా భవిష్యత్ అవసరాల దృష్ట్య ప్రణాళికలు మరియు ఆ ప్రాంతానికి కలిగే ప్రయోజనాలపై వారు వివరించారు.ఈ స్లం కేటాయిస్తే కడప జిల్లాలో వాణిజ్య రంగాల అభివృద్ధికి దోహదం అవుతుందని తెలిపారు.అలాగే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని,ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని చెప్పారు.జిల్లా కలెక్టర్ ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత శాఖలతో చర్చించి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ప్రభుత్వం నుంచి స్థలం కేటాయింపు జరిగితే, ఏపీటీపీసీ ఆధ్వర్యంలో ఆధునిక సదుపాయాలతో కూడిన ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు కలెక్టర్ కు కలిసిన వారిలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు గారితో పాటు ఏపీటీపీసీ వైస్ చైర్మన్ & ఎండీ శేఖర్ బాబు,జనరల్ మేనేజర్ హనుమానాయక్, కడప ఆర్డీఓ, తహసిల్దార్, విఆర్ఓ,అటవీశాఖ అధికారులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.