కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) మైదుకూరు ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి ఆదేశాల మేరకు, నేడు మైదుకూరు నందలి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుతూ ఆనందోత్సాహాలతో వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏపీ రవీంద్ర, మైనారిటీ నాయకుడు సలీం, టీడీపీ జిల్లా కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పునాది వేసిన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.అలాగే గౌరవ ఎమ్మెల్యే శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి సారథ్యంలో మైదుకూరు నియోజకవర్గం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మైదుకూరు మండల అధ్యక్షుడు భీమయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి, క్లస్టర్ ఇన్‌చార్జ్ ఆకుల కృష్ణయ్య, సంజీవ రెడ్డి, టీడీపీ నాయకులు బి.ఎన్. సీను, ధనపాల రవి, పాలమాబు, రాధాకృష్ణ, అక్బర్, శంకర్ రెడ్డి, గుండంరాజు సుబ్బయ్య, జయభరత్ రెడ్డి, సీర్ల నాగ మోహన్, లక్ష్మీనారాయణ రెడ్డి, బండి అమర్నాథ్ తదితరులు మరియు పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



