జూన్ 07(ప్రజావాణి):నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా స్థాయి అండర్-16 క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు కోదాడలోని కె.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఘనంగా ప్రారంభమైంది.హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సమ్మర్ క్యాంప్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్‌లో కోదాడ, నకిరేకల్, మిర్యాలగూడెం, నల్గొండ, యాదాద్రి భువనగిరి జట్లు పాల్గొన్నాయి.ఈ పోటీలను కోదాడ క్రికెట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు,మండల విద్యాశాఖ అధికారి మహమ్మద్ సలీం షరీఫ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యార్థి దశలో క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేసి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించి మంచి పేరు తీసుకురావాలి అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ నందకిషోర్ , కౌన్సిలర్ చైతన్య , కోచ్ సిద్దిక్, ఖాజామీయా, బుల్లయ్య, జబ్బార్, శ్రీకాంత్, సురేష్, హమీద్ తదితరులు పాల్గొన్నారు.




