తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) తిరుపతి రూరల్ మండలం దామినేడు లెక్క దాఖలాలో లిడ్ క్యాప్ సంస్థ పేరుపై ఉన్న భూములపై దొంగ పట్టాలు సృష్టించి అక్రమంగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తిరుపతి ఆర్డిఓ కు మాదిగ లిడ్ క్యాప్ భూముల పరిరక్షణ కమిటీ చైర్మన్ పి సుబ్బయ్య విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తిరుపతి ఆర్డిఓ కార్యాలయానికి చైర్మన్ అధ్యక్షతన పరిరక్షణ కమిటీ సభ్యులు చేరుకొని ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈనెల 9వ తేదీన ఎస్సీ కమిషన్ చైర్మన్ ను కలిసి లిడ్ క్యాప్ భూ సమస్య పై వినతిపత్రం అందజేయగా జిల్లా కలెక్టర్ సూచన మేరకు తిరుపతి ఆర్డీవో ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పరిరక్షణ కమిటీ అధ్యక్షులు పిఎస్ సుబ్బయ్య మాట్లాడుతూ 71/ఏ 2.80 సెంట్లు, 72/3 ఎ 1.74 సెంట్లు, 72/2 ఏ 1.11 సెంట్లు, 101/3 ఏ 0.83 సెంట్లు, 101/ఏ లో 0.83 సెంట్లు, 101/2 ఏ 2.70 సెంట్లు భూమి ఉందని చెప్పారు. 1973 – 74 వ సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం చర్మ కారులకు లిడ్ క్యాప్ సంస్థ పేరు పైన భూమిని కేటాయించడం జరిగిందని తెలిపారు. ఇది మాదిగల అభ్యున్నతికి కోసం కేటాయించడం జరిగిందన్నారు. దీని ద్వారా చర్మకారులు తమ వృత్తులను కొనసాగించు కోవడానికి ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. చర్మకారులకు తీరని అన్యాయం చేసేలా కొందరు భూకబ్జా కు బరితెగించడం దారణమని వారిపై కఠన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎస్సీ, ఎస్టీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌడపేరు చిట్టబాబు, ఎస్సీ, ఎస్టీ, వి.ఎం.సి పి.వాలముని మాట్లాడుతూ లిడ్ క్యాప్ భూమిలో 2023 వ సంవత్సరం గిరిధర్ మురారి, కంచి కదిరి వేలు కుమారుడు గోవిందరాజులు, మాజీ ఎంపీటీసీ అరుణాచలం కలిసి ఈ లిడ్ క్యాప్ సంస్థ ఆధీనంలో ఉన్న 72/2 ఏ 1.11 సెంట్లు భూమిని నాగమ్మ అనే మహిళకు సంబంధించినదని దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని తెలిపారు.
ఆ డాక్యుమెంట్ల ఆధారంగా రెవెన్యూ శాఖ,లిడ్ క్యాప్ సంస్థపై కోర్టులో దావాలు వేసి ఉన్నారని తెలిపారు.ప్రభుత్వ భూమిని కబ్జా చేయాలన్న దురుద్దేశంతో వీరు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి బరితెగించారని పేర్కొన్నారు. గతంలోనూ వీరిపై ప్రభుత్వ, ప్రైవేటు, ఎండోమెంట్ భూములకు సైతం దొంగ డాక్యుమెంట్లు సృష్టించి వాటిని కబ్జా చేసి ప్లాట్లు వేసి అమ్ముకోవడం జరిగిందన్నారు. ఈ విధమైన భూ కబ్జాలకు పాల్పడుతూ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిన వీరిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.కె.సుధాకర్ బాబు (ఎం.ఎం.జె.ఎస్.),చర్మకారుల సంక్షేమ సంఘం పి.కాటయ్య మాట్లాడుతూ ఏకంగా ప్రభుత్వ భూములకే దొంగ పట్టాలను సృష్టిస్తున్న వీరిని ఉపేక్షిస్తే భవిష్యత్తులో ప్రభుత్వ భూములు అన్నింటి పైన వీరు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అమ్ముకునే అవకాశం ఉందని తెలిపారు.అతి తెలివితో దుర్మార్గంగా దొంగ పట్టాలు సృష్టించి భూ కబ్జాలకు పాల్పడుతున్న వీరిని తక్షణం అరెస్టు చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇప్పటి వరకు వీరు దుర్మార్గంగా అక్రమంగా సంపాదించిన ఆస్తులను సైతం స్వాధీనం చేసుకోవాలని కోరారు. లేని పక్షంలో మాదిగ లిడ్ క్యాప్ భూముల పరిరక్షణ కమిటీ పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడుతుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం నాయకులు కారుమంచి మునిరామయ్య, ఆది జాంభవ కమిటి టి.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
లిడ్ క్యాప్ భూములను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్న వారిపై క్రిమినల్ కేసుల నమోదు చేయాలి..మాదిగ లిడ్ క్యాప్ భూముల పరిరక్షణ కమిటీ డిమాండ్,
RELATED ARTICLES




