📄 ePaper
Friday, April 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్డ్వాక్రా సంఘాలకు డిజిటల్ సేవలు… సంఘమిత్రలకు మొబైల్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే

డ్వాక్రా సంఘాలకు డిజిటల్ సేవలు… సంఘమిత్రలకు మొబైల్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

తిరుపతి జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్17) సత్యవేడు నియోజకవర్గంలో డ్వాక్రా మహిళల సాధికారతకు ప్రభుత్వం మరో అడుగు ముందడుగు వేసింది.మహిళా సంఘాల కార్యకలాపాలను మరింత డిజిటల్ దిశగా తీసుకెళ్లేందుకు సంఘమిత్రలకు ఉచిత మొబైల్ ఫోన్లను అందజేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొని సంఘమిత్రలకు మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మహిళా సంఘాల అభివృద్ధిలో సంఘమిత్రలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. డ్వాక్రా సంఘాల పొదుపులు,రుణాల వసూళ్లు, బ్యాంకు లావాదేవీలు వంటి అంశాల్లో సంఘమిత్రలు మార్గనిర్దేశం చేయాలని తెలిపారు. మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే సంఘమిత్రల సేవలు చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రతి పది సంఘాలకు ఒక ఈ–నారీని నియమించి “మన డబ్బులుమన లెక్కలు”యాప్ ద్వారా అన్ని లావాదేవీలను డిజిటల్ పద్ధతిలో నమోదు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి మొబైల్ ఫోన్లను అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.అంతేకాకుండా మహిళా సంఘాలు కేవలం పొదుపుకే పరిమితం కాకుండా చిన్న పరిశ్రమలు,వ్యాపార రంగాల్లోకి అడుగుపెట్టి ఆర్థికంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 271 మంది సంఘమిత్రలకు సాంసంగ్ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.ఫోన్లతో పాటు స్క్రీన్ గార్డ్, పౌచ్,ట్యాగ్ వంటి ఉపకరణాలను కూడా అందజేశారు సత్యవేడు, నాగలాపురం,పిచ్చాటూరు,నారాయణవనం,కెవిబి పురం, వరదయ్యపాలెం, బుచ్చినాయుడు కండ్రిగ మండలాలకు చెందిన సంఘమిత్రలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.మండలాల వెలుగు ఏపీఎంలు,కోఆర్డినేటర్లు,సీసీలు మరియు మహిళా సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular