సిద్దిపేట్ ఏప్రిల్ 15, ప్రజావాణి
రబీ 2025–26 సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లనుసజావుగా నిర్వహించేందుకు జిల్లాలోని సమస్త అధికారులకు ఈ క్రింది కీలక సూచనలు జారీ చేయనైనది.జిల్లాలో 421 కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిగా సిద్ధంగా ఉంచాలి..ముఖ్యంగా ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మీటర్లు, టార్పాలిన్లు, ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్స్, డ్రైయర్లు, డిజిటల్ కాలిపర్స్, హస్క్ రిమూవర్స్ వంటి పరికరాలు పని చేసే స్థితిలో అందుబాటులో ఉండాలని సూచించనైనది.అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో నీడ సదుపాయం, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించనైనది. కొనుగోలు నిర్వహణలో భాగంగా, ఎఫ్ ఏ క్యూ,ప్రమాణాలకుఅనుగుణంగా ఉన్న ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని కొనుగోలుకేంద్రనిర్వాహకులకు సూచించనైనది.గత యాసంగి 2024–25 సీజన్లో జిల్లాలో 93,142 మంది రైతుల నుండి 3,84,147 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.884.56 కోట్లు మద్దతు ధర చెల్లించడం జరిగింది.అలాగే గత వానకాలం 2025–26 సీజన్లో 1,02,058 మంది రైతుల నుండి 3,77,466 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ. 901.66 కోట్లు మద్దతు ధరతో పాటు సన్నధాన్యానికి రూ. 10.14 కోట్లు బోనస్ చెల్లించడం జరిగింది.ప్రస్తుత రబీ 2025–26 సీజన్లో 5,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యంను 421 కొనుగోలు కేంద్రాల ద్వారా (ఐ కె పి –211, పాక్స్ –202, ఎం ఈ పి ఎం ఏ –06, ఎఫ్ పి ఓ –02) కొనుగోలు చేయుటకు ప్రణాళిక సిద్ధం చేయబడింది. ఈ మేరకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటివరకుజిల్లాలో 23 కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి..




