📄 ePaper
Thursday, June 18, 2026
📄 ePaper
HomeతెలంగాణHanumakondaప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఓటు హక్కును కాపాడుకోవాలి

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఓటు హక్కును కాపాడుకోవాలి

📰 Generate e-Paper Clip

ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే.. ఓటు హక్కును కాపాడుకోవాలి…


ఓట్ల తొలగింపు కుట్రను తిప్పికొట్టాలి –

ప్రతి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి

లింగాల తిరుపతి


నడికూడ,జూన్ 17(ప్రజా వాణి) కేంద్ర ప్రభుత్వం  ప్రతిపక్ష ఓట్లను లక్ష్యంగా చేసుకొని తొలగిస్తున్న కుట్రను నడికూడ మండల బిఆర్ఎస్ అధికార ప్రతినిధి లింగాల తిరుపతి బుధవారం మండల పార్టీ కార్యాలయంలో తీవ్రంగా ఖండించారు. SIR పేరు తో బెంగాల్‌లో 86 లక్షలు, బీహార్‌లో 46 లక్షల ఓట్లు ఇదే కుట్రలో భాగంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో మండల కేంద్రంలో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. 2018లో ఆంధ్రప్రదేశ్‌లో “సేవామిత్ర” యాప్ పేరుతో వేలాది ఓట్లు తొలగించిన తీరునే ఇప్పుడు తెలంగాణలో రిపీట్ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కుమ్మక్కై తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకును దెబ్బతీయాలని చూస్తున్నాయని, ఈ కుట్రను ప్రతి కార్యకర్త తిప్పికొట్టాలని నాయకులకు పిలుపునిచ్చారు.

*కార్యకర్తలకు సూచనలు*:
మండలంలోని ప్రతి గ్రామం, ప్రతి బూత్ పరిధిలో ఓటర్ జాబితాలను పరిశీలించాలి. అర్హులైన వారి పేర్లు తొలగిపోకుండా చూడాలి.సంబంధిత బి ల్ ఓ లతో నిరంతరం సమన్వయం ఉంచుకోవాలి. ఫారం-7 ద్వారా వచ్చే అక్రమ తొలగింపు దరఖాస్తులపై వెంటనే అభ్యంతరం తెలపాలి.ప్రతి కుటుంబం ఓటర్ హెల్ప్లిన్ అప్ ద్వారా తమ ఓటు స్టేటస్‌ను చెక్ చేసుకోవాలి. కొత్తగా 18 ఏళ్లు నిండిన వారి ఓట్లు నమోదయ్యేలా చూడాలి.ఎవరైనా ఓటు తొలగింపుకు గురైతే వెంటనే మండల పార్టీ నాయకత్వానికి సమాచారం ఇవ్వాలి.ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఓటు హక్కును కాపాడుకోవాలని, ఈ బాధ్యతను ప్రతి కార్యకర్త తమ కర్తవ్యంగా భావించాలని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular