📄 ePaper
Friday, April 17, 2026
📄 ePaper
HomeతెలంగాణMedakఅంబేద్కర్ జీవితం ఆదర్శం

అంబేద్కర్ జీవితం ఆదర్శం

📰 Generate e-Paper Clip

కుసంగి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 జయంతి వేడుకలు

టేక్మాల్ ఏప్రిల్ 14 (మన ప్రజావాణి) కుసంగి గ్రామపంచాయతీ పరిధిలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అలాగే స్కూల్ వద్ద ఏర్పాటుచేసిన అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు, బి,పాపయ్య మాట్లాడుతూ డాక్టర్ భీమ్ రావు రాంజీ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత గొప్ప సంఘ సంస్కర్త మరియు అణగారిన వర్గాల ఆశాజ్యోతి బాబా సాహెబ్ గా సుపరిచితులైన ఆయన అంటరానితనం కులవివక్షపై జీవితాంతం పోరాడారు భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా దేశ అత్యున్నత చట్టాన్ని రూపొందించారు భారత రాజ్యాంగ రచనకు ఏర్పాటు చేసిన డ్రాప్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా వ్యవహరించి రాజ్యాంగాన్ని రూపొందించారు అని అన్నారు స్వతంత్ర భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా సేవలందించిన ఆయన బహుముఖ ప్రజ్ఞశాలిగా దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుబ్బారావు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు బుడ్డోళ్ళ పాపయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్.శ్రీకాంత్, కే.సాయిలు, గౌరవ అధ్యక్షులు సంగయ్య, వార్డు మెంబర్లు రాజు, దుర్గయ్య, అనిల్ గౌడ్, గ్రామ పెద్దలు భగవాన్ రెడ్డి, మొగుల్ రెడ్డి,అంజయ్య, ఆరిఫ్, సత్యనారాయణ గౌడ్, డి.వెంకటేశం లక్ష్మయ్య,,రాములు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు నర్సింలు, ఆర్ శ్రీనివాస్, సునీల్, జైపాల్, కె.మహేష్, రాములు, కృష్ణ, కే.రవి, ఆర్.రాకేష్, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular