📄 ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు గాంధారి అశోక్ సిఐటియు అధ్యక్షులు పోచారం సర్కిల్ 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందరివాడు గాంధారి అశోక్ సిఐటియు అధ్యక్షులు పోచారం సర్కిల్ 

📰 Generate e-Paper Clip

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ ఎనిమిదవ వార్డు రాజీవ్ గృహకల్ప లో పోచారం సర్కిల్ సిఐటియు అధ్యక్షులు గాంధారి అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం రోజు ఉదయం ఆర్ జి కె కాలనీ జిహెచ్ఎంసి కార్మికులతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా గాంధారి అశోక్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో మహానుభావులలో ఒకరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయన రాజ్యాంగ నిర్మాతనే కాదు సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన గొప్ప సామాజిక సంస్కర్త అణగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు నేడు మనం అనుభవిస్తున్న హక్కులు అన్నీ కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే సాధ్యమయ్యాయని అన్నారు ఈరోజు భారతదేశ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఎదగడానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి కారణం సమాజంలో మార్పు కోసం అణగారిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన విశ్వ మానవుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మా సిఐటియు పక్షాన జిహెచ్ఎంసి కార్మికుల పక్షాన ఆయనకు మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తూ యువత ఆయన చూపిన మార్గంలో నడిచి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని పోచారం సర్కిల్ సిఐటియు అధ్యక్షులు గాంధారి అశోక్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు ఆర్ కళావతి ఎస్ శాంత జీ శ్రావణి సిహెచ్ ఎల్లమ్మ ఐలమ్మ మౌనిక జి కిరణ్ సిహెచ్ లింగస్వామి ఎస్ నరసింహ యు శివ జమ్మన్న శివా బసవయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular