📄 ePaper
Monday, April 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే,,తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ...

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే,,తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కె. రితేష్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కడపజిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్11)బలహీన వర్గాల ఆశాజ్యోతి,సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని,బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ కె.రితేష్ రెడ్డి  బద్వేలు మున్సిపాలిటీలోని సిద్ధవటం రోడ్డులో గల పూలే గారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా శ్రీ కె. రితేష్ రెడ్డి గారు మాట్లాడుతూ “మహాత్మా పూలే గారు అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం, సమాన హక్కుల సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి. సమాజంలో కుల వివక్షను నిర్మూలించి సమానత్వాన్ని నెలకొల్పడంలో ఆయన చేసిన సేవలు అపారమైనవి. తన సహచరిణి సావిత్రీబాయి పూలే గారితో కలిసి 1848లోనే బాలికల కోసం దేశంలోనే తొలి పాఠశాలను స్థాపించి మహిళా సాధికారతకు బాటలు వేసిన మహనీయుడు ఆయన. పూలే గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టి సమసమాజ నిర్మాణానికి కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బద్వేలు కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న గారు, మున్సిపాలిటీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బసిరెడ్డి రవికుమార్ రెడ్డి (బద్వేల్), పాపుదిప్పు మల్లికార్జున రెడ్డి (అట్లూరు), రామచంద్రారెడ్డి (బి.కోడూరు), జిల్లా వైస్ ప్రెసిడెంట్ సీతా వెంకటసుబ్బయ్య, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్‌ కొడవలి వేణుగోపాల్, నరసింహనాయుడు, బైసాని ప్రతాపరెడ్డి, కనుమర్లపూటి ప్రసాద్, బోరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, సింగరయ్య, బిగ్ బాస్, వెంకటయ్య, PRP భాష,ఐజయ్య, అబ్రహం,రామ సుబ్బారెడ్డి, సాయి శివారెడ్డి, హాబీబ్, ఉంటా నరసింహులు, మస్తాన్ బాబు, ఎల్లారెడ్డి,శవ, మజ్జారి చెన్నయ్య,ఎద్దుల ప్రసాద్, నవ్య జ్యోతి రెడ్డి, PRP వెంకటసుబ్బయ్య తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఇట్లు,తెలుగుదేశం పార్టీ కార్యాలయం,బద్వేల్ నియోజకవర్గం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular