📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్దోమల నియంత్రణ " " ఫ్రైడే డ్రైడే "తోనే సాధ్యం, టి. నరసింహా రెడ్డి సబ్...

దోమల నియంత్రణ ” ” ఫ్రైడే డ్రైడే “తోనే సాధ్యం, టి. నరసింహా రెడ్డి సబ్ – యూనిట్ ఆఫీసర్

📰 Generate e-Paper Clip

కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్10)పోరుమామిళ్లలో దోమల నియంత్రణ “ఫ్రైడే డ్రైడే “తోనే సాధ్యం,టి.నరసింహా రెడ్డి.సబ్ -యూనిట్ ఆఫీసర్.దోమల నియంత్రణ ప్రజల అందరి భాగస్వామ్యం తోనే సాధ్యం అవుతుందని,ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిలో ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తే, దోమలు అభివృద్ధి చెందకుండా నివారించ వచ్చు అని,ప్రతి వక్కరు దోమ తెరలు వాడటం శ్రేయస్కరమని మలేరియా సబ్ యూనిట్ అధికారి టి.నరసింహా రెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ రోజు పోరుమామిళ్ల మండలంలో 1,2,3,వార్డ్ సచివాలయం లలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని తనిఖీ చేయడం జరిగింది. వైద్య సిబ్బంది ఇల్లులు తిరిగి బానలు, ఫ్రిజ్జులు, డ్రమ్ములు, టైర్లను,కూలర్స్ ను పరిశీలించారు.పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలని సూచించారు. కాచి వడగట్టిన నీటిని త్రాగాలని సూచించారు.వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రులకు పోయి,వేల రూపాయలు పోగొట్టుకోవద్దని సూచించారు.ఈ సందర్భంగా నరసింహా రెడ్డి మాట్లాడుతూ,దోమల వలన మలేరియా,ఫైలేరియా,డెంగ్యూ,చికెన్ గున్యా,మెదడువాపు వ్యాధులు వస్తాయన్నారు.ఏ జబ్బులు వచ్చిన భయపడవలసిన అవసరం లేదన్నారు.నిరంతరం వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారన్నారు.104,విలేజ్ హెల్త్ క్లినిక్ లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు.వీటిలో ప్రతి ఒక్కరూ వైద్యం చేయించుకుని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నారు.ధోమ!ఎంత కంత్రీ ధానివే అటు పక్కా ఉంటావు ఇటు పక్కా ఉంటావు చటుక్కున కాటేసి సటు క్కున పోతావు అనే పాటను పాడి నరసింహ రెడ్డి పలువురిని అలరింపజేసారు.ఈ కార్యక్రమం లో ఈ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషనల్ అధికారి,సాదు వెంకటేశ్వర్లు,హెల్త్ అసిస్టెంట్ సాధు సత్యనారాయణ,స్వామి రంగయ్య,రేష్మా,ఏఎన్ఎం.సి హెచ్ ఓ.వైద్యసిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు,.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.