📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ద్వారకాతిరుమల కొండపై 'నకిలీ' కలకలం! దర్శనం టిక్కెట్ల స్కామ్‌లో ఏడుగురు నిందితుల అరెస్ట్

ద్వారకాతిరుమల కొండపై ‘నకిలీ’ కలకలం! దర్శనం టిక్కెట్ల స్కామ్‌లో ఏడుగురు నిందితుల అరెస్ట్

📰 Generate e-Paper Clip

ఏలూరు జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్10)ద్వారకాతిరుమల కొండపై ‘నకిలీ’ కలకలం!దర్శనం టిక్కెట్ల స్కామ్‌లో ఏడుగురు నిందితుల అరెస్ట్  ఇంజనీర్,మాజీ సూపర్వైజర్ హస్తం ల్యాప్‌టాప్, ప్రింటర్ స్వాధీనం.నిందితులకు రిమాండ్.ద్వారకాతిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నకిలీ టిక్కెట్ల దందా బట్టబయలైంది. స్వామివారి దర్శనం పేరుతో భక్తులను మోసం చేస్తూ, నకిలీ టిక్కెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో భీమడోలు సీఐ పి. కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి. సుధీర్ బృందం మెరుపు దాడి చేసి ఏడుగురు నిందితులను కటకటాల వెనక్కి నెట్టింది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.ఈ స్కామ్‌లో ప్రధాన సూత్రధారి అయితంపూడి సాయి జగన్నాథ రాజుతో పాటు ములగాల రమేష్,తొంటపాక సత్యనారాయణ, ఉప్పలపాటి శ్రీనివాసు,ఆలయ సెక్యూరిటీ గార్డు కీర్తి అశోక్ కుమార్,మాజీ సూపర్వైజర్ మానుకొండ ఆంజనేయులు,సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ముత్యాల నాగ వెంకట సత్య శ్రీనివాసరావులను అరెస్ట్ చేశారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నకిలీ టిక్కెట్లు సృష్టిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు,నిందితుల నుంచి ఒక డెల్ లాప్‌టాప్, టీవీఎస్ థర్మల్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.గతంలోనూ రూ.200 నకిలీ టిక్కెట్ల వ్యవహారంలో సముద్రాల శేషుబాబు,మేక సతీష్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా పట్టుబడ్డ నిందితులను భీమడోలు న్యాయస్థానంలో హాజరుపరచగా,న్యాయమూర్తి వారికి రిమాండ్ విధించారు.ఈ స్కామ్‌లో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంటే కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ శ్రావణ్ కుమార్ హెచ్చరించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కానిస్టేబుళ్లు ధర్మరాజు, లక్ష్మీనారాయణ, హోంగార్డు ప్రకాష్‌లను అధికారులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.