📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్ప్రజా సమస్యల పరిష్కారమే మన కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయం - ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల...

ప్రజా సమస్యల పరిష్కారమే మన కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయం – ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

📰 Generate e-Paper Clip

కడప జిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్10) ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు “ప్రజా దర్బార్” నిర్వహించి నియోజకవర్గ ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి సమస్యలను తెలుసుకొని పరిష్కరించవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ,ప్రధానంగా గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రెవెన్యూ పరంగా భూ సమస్యలతో ఇబ్బంది పడుతున్న బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగింది.అదేవిధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన సిసి రోడ్ల నిర్మాణం మరియు వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించడం జరిగింది.ప్రజా సంక్షేమమే పరమావధిగా పారదర్శక పాలనతో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది.మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు.నిరంతరం ప్రజల కోసమే మన ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారు ప్రజలకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య గారు,రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ Vs ముక్తియార్ గారు,రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి గారు,K.C కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ వైస్ చైర్మన్ ద్వార్శల గురివి రెడ్డి గారు,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసుల రెడ్డి గారు,మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఆసం రఘురామి రెడ్డి గారు,కడప జిల్లా పార్లమెంట్ కార్యదర్శి తలారి పుల్లయ్య గారు,పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు గారు,శివాలయం మాజీ చైర్మన్ పల్లా శంకర్ నారాయణ గారు,బచ్చల ప్రతాప్ గారు,మాజీ కౌన్సిలర్ జిలాన్,కట్టమీది రామకృష్ణారెడ్డి,రిటైర్డ్ లెక్చరర్ దస్తగిరి రెడ్డి గారు,జనసేన సుంకర మురళీ,జనసేన మంచి శివకుమార్,రెవెన్యూ,పంచాయతీ రాజ్,హౌసింగ్ అధికారులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.