📄 ePaper
Epaper 2
Sunday, October 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు.

పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు.

📰 Generate e-Paper Clip

మార్కాపురం జిల్లాప్రజావాణిన్యూస్(ఏప్రిల్07)అసాంఘిక కార్యకలాపాల కట్టడికి ఎన్‌ఫోర్స్‌మెంట్ ముమ్మరం చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు.మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్.గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక పోలీసు బృందాలు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్ర‌మంలో టాస్క్ ఫోర్స్ సీఐ యు. సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఎస్సై సుదర్శన్, ఏఎస్ఐ మహబూబ్ భాష మరియు సిబ్బంది కలసి పామూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టాకిందపల్లి గ్రామ పొలాలలో పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 4 మోటార్ సైకిళ్లు, 5 సెల్ ఫోన్లు మరియు రూ.10010/- నగదు స్వాధీనం చేసుకున్నారు.జూద క్రీడలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే, జిల్లాలో ఎక్కడైనా ఇలాంటి కార్యక్రమాలకు సంబంధించి సమాచారం ఉంటే, వెంటనే డయల్ 112 నంబర్‌కు లేదా పోలీసు వాట్సాప్ నంబర్ 9121102266కు మెసేజ్ ద్వారా తెలియజేయాలని ప్రజలను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.