📄 ePaper
Wednesday, April 22, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetకోహెడ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడులు

కోహెడ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడులు

📰 Generate e-Paper Clip

కోహెడ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడులు

రెండు ట్రాక్టర్లు సీజ్

బెజ్జంకి -కోహెడ, ఏప్రిల్ 6(ప్రజావాణి )

సిద్దిపేట జిల్లా కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అందిన సమాచారం మేరకు, కూరేల్లా గ్రామ శివారులోని మోయ తుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తెలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు.పోలీసులను గమనించిన వెంటనే ఇసుకతో లోడ్ చేసిన రెండు ట్రాక్టర్లు వాగులో ఉండగా, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో ట్రాక్టర్ల యజమానుల వద్ద ఎటువంటి అధికారిక అనుమతులు లేవని గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్లు:
TS-01-EH-6256 / TS-36-T-5518 – యజమాని: ఈగ శ్రీనివాస్, కూరేల్లా,TG-36-3367 / AP-36-AV-1109 – యజమాని: పోలేవేని అనిల్, కూరేల్లా పట్టుబడిన ట్రాక్టర్లను కోహెడ పోలీస్ స్టేషన్‌కు తరలించి, నిందితులపై కేసులు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఎస్సై పి. అభిలాష్ మాట్లాడుతూ, అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని, జైలు శిక్ష కూడా తప్పదని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular