📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetబెజ్జంకి అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ

బెజ్జంకి అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ

📰 Generate e-Paper Clip

గర్భిణీలు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ

బెజ్జంకి,ఏప్రిల్ 6(ప్రజావాణి)

సిద్ధిపేట జిల్లా బెజ్జంకి అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలు,బాలింతలకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొల్లం శ్రీధర్, వార్డు సభ్యులు లింగాల శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ బొల్లం శ్రీధర్ మాట్లాడుతూ గర్భిణీలు,బాలింతలు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని,వాటి వల్ల ఆరోగ్యానికి మంచి ఫలితాలు లభిస్తాయని తెలిపారు.
అలాగే చిన్నారుల బరువు, ఎత్తును నిరంతరం పరిశీలిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ కనకలక్ష్మి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular