📄 ePaper
5pm
7pm
Sunday, November 29, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రజల భాగస్వామ్యం లేని సామాజిక తనిఖీ ఎందుకు?

ప్రజల భాగస్వామ్యం లేని సామాజిక తనిఖీ ఎందుకు?

📰 Generate e-Paper Clip

మంచాల్ మండల్ లో తూతూ మంత్రంగా సామాజిక తనిఖీ

అధికారుల సమక్షంలోనే ముగిసిన సమావేశం.. ప్రజలకు సమాధానం చెప్పేదెవరు?

 

రంగారెడ్డి జిల్లా, నవంబర్ 29 (ప్రజావాణి): మంచాల్

 

ప్రజల సమక్షంలో పారదర్శకంగా జరగాల్సిన సామాజిక తనిఖీ సమావేశం ప్రజలకు సరైన సమాచారం అందించకుండానే నిర్వహించడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో జరగాల్సిన కార్యక్రమం కేవలం అధికారుల సమక్షంలోనే ముగియడం పలు విమర్శలకు తావిస్తోంది. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులు, వాటి కోసం ఖర్చు చేసిన నిధులు, కూలీలకు కల్పించిన ఉపాధి, పనుల నాణ్యత తదితర అంశాలపై సమగ్రంగా చర్చించి, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాల్సి ఉంది. అలాగే పనుల అమలులో ఏవైనా అవకతవకలు జరిగితే వాటిని గుర్తించి, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఎలాంటి స్పష్టమైన చర్యలు కనిపించకుండానే సమావేశాన్ని ముగించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సామాజిక తనిఖీ అంటే కేవలం సమావేశం నిర్వహించి రికార్డుల్లో నమోదు చేయడమేనా ప్రజాధనం ఖర్చు చేసిన పనులపై ప్రజలకు జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం లేదా? గ్రామస్థాయిలో జరిగిన పనులపై పూర్తిస్థాయి విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుంచాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ సుభాషిణి, రిటైర్డ్ జేడీ సునీతా మూర్తి, ఏపీడీ శశికుమార్, ఏపీవో సురేష్, జేఈ సునీత, ఎస్టీఆర్‌పీ అశోక్ కుమార్, ఏరియా ఇంజనీర్లు, ఈసీ విమల, సాంకేతిక సహాయకులు, క్షేత్రస్థాయి సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకం కింద కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించిన పనులపై పూర్తి స్థాయిలో, ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకమైన సామాజిక తనిఖీ ఎప్పు ఇప్పుడు గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.