ఎటపాక మండలం. నెల్లిపాక పంచాయతీ. లో సర్పంచ్ ఎన్నికలవేళ. పలు కుటుంబాలు. వైయస్సార్సీపీని వీడి. తెలుగుదేశంలో చేరిక!
మన ప్రజావాణి( నవంబర్ 28 ) ఎటపాక మండలం
సర్పంచ్ ఎన్నికల చివరి రోజు ప్రచారం లో త్రిపురపెంటవీడు పంచాయితీ నందమూరి కాలనీ లో Ysrcp నుండి తెలుగుదేశం పార్టీ లో 10 కుటుంబాలు తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు మరియు యూనిట్ ఇంచార్జ్ బాచినేని మల్లేశ్వరరావు మాజీ సర్పంచ్ మోసం రాజులు మరియు గ్రామ పార్టీ అధ్యక్షులు దుద్దుకూరి సతీష్ ఆధ్వర్యంలో టీడీపీ లో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లభనేని చందు మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి గ్రామ అభివృద్ధి కోసం
పలువురు తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగిందని. వారికి అన్ని విధాలుగా పార్టీ అందుబాటులో ఉంటుందని
వారి నమ్మకాన్ని కూటమి ప్రభుత్వం నిలబెడుతుందని
త్రిపుర పెంట వీడు గ్రామంలో. తెలుగుదేశం జెండా ఎగురుతుందని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

