*ఆల్గోల్ గ్రామా లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందజేత*
*ఎమ్మెల్యే మాణిక్ రావు, సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి కీ కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు*
జహీరాబాద్, నవంబర్ 27 (ప్రజావాణి): నియోజకవర్గ పరిధిలోని ఆల్గోల్ గ్రామానికి చెందిన చాకలి వెంకన్న, బ్యాగరి నర్సింలు గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు చేతుల మీదుగా అందజేశారు.
వైద్య చికిత్సల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఈ ఆర్థిక సహాయం కొంత మేరకు ఊరటనివ్వనుంది.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే మాణిక్ రావు, అల్గొల్ గ్రామ సర్పంచ్ చల్ల శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
అర్హులైన పేద కుటుంబాలకు వైద్య చికిత్సల విషయంలో ప్రభుత్వ సహాయం అందించడం ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంలో సీఎంఆర్‌ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోంది.
