📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

📰 Generate e-Paper Clip

మహాత్మా జ్యోతిరావు ఫూలే 136వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి-BLR

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 28

మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి 136వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి-BLR ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ఫూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు…
అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విగ్రహ పాదాలను పాలతో శుద్ధి చేసి తమ గౌరవాభిమానాలను చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ, వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష నవీన్, పట్టణ కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
సమాజంలో సమానత్వం, విద్య, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయాలు చిరస్మరణీయమని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.