📄 ePaper
5pm
7pm
Sunday, November 29, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

📰 Generate e-Paper Clip

​మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు కృషి చేయాలి: ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 28

​మిర్యాలగూడ ఎమ్మెల్సీ
క్యాంపు కార్యాలయంలో పూలే వర్ధంతి వేడుకలు
​చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు
సమాజంలో సమానత్వం కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ కొనియాడారు. శనివారం మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
​ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ.. సమాజంలో వేళ్లూనుకుపోయిన కులవివక్ష, అసమానతలు, మూఢనమ్మకాల నిర్మూలనకు జ్యోతిరావు పూలే అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ముఖ్యంగా మహిళా విద్య, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. నేటి తరం పూలే ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు.
​ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని పూలేకు ఘన నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.