📄 ePaper
5pm
7pm
Sunday, November 29, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకళాకారులకు అండగా బిఆర్ఎస్ నాయకురాళ్లు

కళాకారులకు అండగా బిఆర్ఎస్ నాయకురాళ్లు

📰 Generate e-Paper Clip

*కళాకారులకు అండగా బిఆర్ఎస్ నాయకురాళ్లు*

బండారుగూడెం కొమ్ము కోయ బృందానికి రూ.10 వేల ఆర్థిక సాయం*

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 28

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం.అడగగానే ఆదుకున్న పెద్ద మనసు… గిరిజన సంప్రదాయ కళాకారులకు కాసాని నాగ శేషా పద్మ, కౌన్సిలర్ ఉదయ్ జ్యోతి చేయూత.అంతరించిపోతున్న గిరిజన సంప్రదాయ కళలను ప్రోత్సహించడంలో తమకు సాటిలేదని బి ఆర్ ఎస్ నాయకురాలు కాసాని నాగ శేషా పద్మ, కౌన్సిలర్ డాక్టర్ ఉదయ్ జ్యోతి మరోసారి నిరూపించుకున్నారు. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సాయం చేస్తూ ప్రజా సేవలో తమదైన ముద్ర వేస్తున్నారు.

అశ్వారావుపేట మండలం, బండారుగూడెం (బండారుగుంపు) గ్రామానికి చెందిన 18 మందితో కూడిన ‘కొమ్ము కోయ’ సాంస్కృతిక నృత్య బృందం తమ ప్రదర్శనల కోసం డ్రెస్ కోడ్ కావాలని నిర్ణయించుకుంది. ఎంతోమందికి సాయం చేస్తున్న నాయకురాళ్లు తమకూ సహాయం చేయాలని కోరుతూ, బి ఆర్ ఎస్ నాయకురాలు కాసాని నాగ శేషా పద్మ, కౌన్సిలర్ డాక్టర్ ఉదయ్ జ్యోతి దృష్టికి తీసుకెళ్లారు.

కళాకారుల అభ్యర్థనకు తక్షణమే స్పందించిన ఆ ఇద్దరు నాయకురాళ్లు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా డ్రెస్ కోడ్ కోసం రూ.10,000 నగదును అందించి తమ ఉదారతను చాటుకున్నారు. అందిన సాయంతో త్వరలోనే నూతన డ్రెస్ కోడ్ సిద్ధం చేసుకుంటామని కళాకారులు హర్షం వ్యక్తం చేశారు.

అడిగిన వెంటనే స్పందించి రూ.10 వేల ఆర్థిక సాయం అందించిన కాసాని నాగ శేషా పద్మ, డాక్టర్ ఉదయ్ జ్యోతిలకు బండారుగూడెం కొమ్ము కోయ బృందం సభ్యులు మడివి శేఖర్, ముచిక గంగరాజు, పద్దం నగేష్, ఉకె కన్నమ్మ, మడివి ఆదిలక్ష్మి, మడకం మైసమ్మ, పద్దం యేసుమణిలతో పాటు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తూ, గిరిజన సంస్కృతికి పెద్దపీట వేస్తున్న వీరి సేవా నిరతిని మండల ప్రజలు అభినందిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.