📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపేకాట స్థావరంపై పోలీసుల దాడి....ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్టు

పేకాట స్థావరంపై పోలీసుల దాడి….ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్టు

📰 Generate e-Paper Clip

*పేకాట స్థావరంపై పోలీసుల దాడి….ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్టు*

*25 వేల రూపాయలు నగదు.. ఆరు సెల్ ఫోన్ స్వాధీనం*

* *మన ప్రజావాణి మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-*

జిల్లాలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల బొక్కలగుట్ట లోని సిరమిక్స్ ఫ్యాక్టరీ ప్రాంతంలో గురువారం పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ, రామగుండం పోలీస్ కమీషనరేట్ నార్కోటిక్ టీమ్, టాస్క్ ఫోర్స్ కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు టాక్స్ ఫోర్స్ ఏసిపి శ్రీనివాస్ నేతృతంలో ఎస్ఐ దీకొండ రమేష్, ఆర్ ఎస్ఐ ప్రవీణ్, సిబ్బంది తోపాటు రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా బొక్కలగుట్ట పరిధిలోని సిరామిక్ ఫ్యాక్టరీ ప్రాంతంలో దాడులు నిర్వహించామని తెలిపారు. ఈ దాడిలో డబ్బులు పందెంగా పెట్టి, అక్రమంగా పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు వారి వద్ద నుండి 25890 రూపాయల నగదు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టుబడిన వారిలో జిల్లాలోని మంచిర్యాల పట్టణంలోని విద్యానగర్ కు చెందిన నాతడి రామ మహేందర్, మందమర్రి మండలం బొక్కలగుట్ట కు చెందిన మల్ల కేదారి, రామకృష్ణాపూర్ పట్టణంలోని బి జోన్ కు చెందిన తూడి శ్రీనివాస్, మందమర్రి చెందిన తాండ్ర సుధాకర్, రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన షేక్ చాంద్ పాషా, గద్దెరాగడి కి చెందిన గన్నవేని సుధాకర్ లు కలరని తెలిపారు. వీరిని తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం రామకృష్ణాపూర్ పోలీస్ కు స్టేషన్ తరలించామన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, పేకాట, జూదం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.