📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణదీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

📰 Generate e-Paper Clip

దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.

బాన్సువాడకు బీఆర్ఎస్ కార్యకర్తలు,తెలంగాణ ఉద్యమకారులు భారీగా తరలిరావాలి.

పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోరిల్ శ్రీనివాస్ రావు పిలుపు.

బాన్సువాడ/ప్రజావాణి:-తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో నవంబర్ 29వ తేదీకి ప్రత్యేక చారిత్రక ప్రాధాన్యత ఉందని.2009 నవంబర్ 29న నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో సాగిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి కీలక మలుపుగా నిలిచిందని బాన్సు వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మోరిల్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష ఉద్యమానికి ఆయుధంలా మారిందని.ఆ చారిత్రాత్మక పోరాట ఘట్టాన్ని ప్రతి సంవత్సరం గుర్తుచేసుకోవడం మనందరి బాధ్యత అని ఆయన అన్నారు.ఈ నేపథ్యంలో ఆదివారం బాన్సువాడలో నిర్వహించనున్న కెసిఆర్ దీక్షా దివస్ కార్యక్రమాన్ని నియోజక వర్గవ్యాప్తంగా ఘనంగా విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని ఆయన పిలుపునిచ్చారు.బాన్సువాడ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలు,తెలంగాణ ఉద్యమకారులు, పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు.ప్రతి ఒక్కరూ సమయపాలన పాటిస్తూ ఆదివారం బాన్సువాడకు చేరుకుని దీక్షా దివస్ కార్యక్రమా న్ని దిగ్విజయం చేయాలని విజ్ఞప్తి చేశారు.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పేలా దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఐక్యతకు ప్రతీకగా నిలపాలని మోరీల్ శ్రీనివాస్ రావు ఆకాంక్షించారు.పార్టీ కార్యకర్తలు,ఉద్యమకారుల సమష్టి భాగస్వామ్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసి కేసీఆర్ పోరాట స్ఫూర్తిని మరోసారి చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.