📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణగ్రామ గ్రామాన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం

గ్రామ గ్రామాన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం

📰 Generate e-Paper Clip

*గ్రామ గ్రామాన మహిళా సమాఖ్య భవనాల నిర్మాణం*

*భైంసా మండలంలో రూ.2.80 కోట్లతో 28 భవనాల నిర్మాణం పూర్తి.. వలేగాంలో ఐకేపీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో భైంసా, నవంబర్ 28:–
మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మహిళా సంఘాల బలోపేతం కోసం ముధోల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రూ.20 లక్షల నిధులతో రెండు మహిళా సమాఖ్య భవనాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. శనివారం భైంసా మండలంలోని వలేగాం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య (ఐకేపీ) భవనాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకేపీ భవనాల నిర్మాణంలో రాష్ట్రంలోనే ముధోల్ నియోజకవర్గం ముందంజలో ఉందని, భైంసా మండలంలో అత్యధిక భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. మండలంలో రూ.2.80 కోట్లతో 28 మహిళా సమాఖ్య భవనాలను నిర్మించి ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పనులకు సహకరించిన అధికారులు, గ్రామ సర్పంచులను అభినందించారు. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా ఐక్యంగా ఉండి ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని సూచించారు. తమ పిల్లలకు చిన్ననాటి నుంచే మంచి సంస్కారాలు, నైతిక విలువలు నేర్పించాలని కోరారు.అదేవిధంగా వి.బి.జీ. రామ్‌జీ పథకం కింద నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పొలాలకు వెళ్లే రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని తెలిపారు. వచ్చే జూన్‌ నాటికి గ్రామస్తులంతా సమష్టిగా కృషిచేసి వ్యవసాయ రహదారుల నిర్మాణం పూర్తి చేసుకోవాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వలేగాం గ్రామానికి ఇప్పటివరకు సుమారు రూ.కోటి నిధులు కేటాయించామని, అందులో కొన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అశోక్, నాయకులు దిగంబర్, గంగాప్రసాద్ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి వలేగాం గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని కొనియాడారు. గ్రామంలో ఇప్పటివరకు 72 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు, ఎల్‌ఓసీలు అందించడంతో పాటు అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా సహకరిస్తున్నారని తెలిపారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకు మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఏపీడీ విఠల్, ఐకేపీ ఏపీఎం రమేష్, మాజీ ఎంపీపీ రజాక్, సర్పంచులు సిరం సుష్మారెడ్డి, శ్యాంరావు పటేల్, అశోక్, సుధాకర్, వినోద్, మహేందర్, మాజీ సర్పంచ్ లక్ష్మణరావు పటేల్, ఆఖిల్, ఉపాధి హామీ ఏపీవో, వివిధ శాఖల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.