📄 ePaper
5pm
7pm
Saturday, November 28, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు

ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు

📰 Generate e-Paper Clip

ఈటల రాజేందర్‌పై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన బీజేపీ నాయకులు

ప్రజావాణి నవంబర్ 28

హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి బీజేపీ నాయకుల సవాల్

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించి హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు

ఈ సందర్భంగా కమలాపూర్ గ్రామ సర్పంచ్ పబ్బు సతీష్, బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, హుజురాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బండి కళాధర్ మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించారని ఈ విషయం ప్రజలందరికీ తెలిసిన వాస్తవమని పేర్కొన్నారు

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేస్తూ ఆయన ఏ పార్టీలో అడుగుపెడితే ఆ పార్టీ నష్టపోతుందని ఆరోపించారు. తన సొంత గ్రామానికి సైతం రోడ్డు వేయించలేని ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు

హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు ఈటల రాజేందర్ ప్రజల మధ్య పనిచేసిన నాయకుడని ఆయనను విమర్శించే స్థాయి కౌశిక్ రెడ్డికి లేదని వ్యాఖ్యానించారు

నియోజకవర్గంలో కనిపిస్తున్న రహదారులు ప్రభుత్వ భవనాలు విద్యాసంస్థలు ఆసుపత్రుల అభివృద్ధిలో ఈటల రాజేందర్ కృషి ఉందని వారు పేర్కొన్నారు కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని చెప్పడం హాస్యాస్పదమని అదే అభివృద్ధి రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు

ఈటల రాజేందర్‌పై ఇకపై తప్పుడు ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు హెచ్చరించారు

ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ కమలాపూర్ సర్పంచ్ పబ్బు సతీష్, హుజురాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు బండి కళాధర్ శనిగరం సర్పంచ్ కొత్తపల్లి రాజు బుర్ర కరుణాకర్ తుమ్మ శోభన్ బాబు కనుకుంట్ల అరవింద్ కొండం శ్రీనివాస్ ఇనుగాల రత్నాకర్ పెండ్యాల తిరుపతి రెడ్డి తూర్పాటి భాస్కర్ పుల్ల అద్భుత రావు మార్క అశోక్, పిల్లి సతీష్ రాంశెట్టి రాజయ్య పంజాల సారయ్య చెలిక శ్రీనివాస్ మౌటం రమేష్ బాబు అర్వపల్లి సామ్రాజ్యం గౌడ్, కొండమీదీ రవి, తూర్పాటి క్రాంతి మౌటం సుభాష్ జక్కుల రమేష్ మునిగే రాజు రాణప్రతాప్ ఓదెలు సాంబయ్య మౌటం సంపత్ ర్యాకం సంపత్ కట్కుకూరి శంకర్ పచ్చిమట్ల కుమారస్వామి బైరీ రాజేష్ చేనుమల్ల రంజిత్ ప్రభాకర్ రెడ్డి సుమన్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.