📄 ePaper
5pm
7pm
Friday, November 27, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణప్రభుత్వ ఉద్యోగుల లేక టిడిపి తొత్తుల వైసిపి నాయుకులు మండిపాటు

ప్రభుత్వ ఉద్యోగుల లేక టిడిపి తొత్తుల వైసిపి నాయుకులు మండిపాటు

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ ఉద్యోగుల లేక టిడిపి తొత్తుల
వైసిపి నాయుకులు మండిపాటు

ఉరవకొండ నవంబర్ 27 ప్రజావాణి దేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు గడిచిన భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం ఎన్నికల్లో పోటీ చేయడానికి మాత్రం సామాన్యులకు స్వతంత్రం రాలేదని వైసిపి నాయకులు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు ఈ సందర్భంగా గురువారం మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణంలో వైసిపి వార్డు మెంబర్లు బి శర్మాస్,గొర్ల అరుణ,చెజేలు నాగవేణి మాట్లాడుతూ పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 5వార్డు మరియు 9,14వ వార్డు నామినేషన్ వేసిన పత్రాలు ఎన్నికల అధికారి టి సత్యనారాయణ పరిశీలించి ఎన్నికల బరిలో ఉన్నట్లుగా నిర్ధారించారన్నారు, అంతే కాకుండా పంచాయతీ కార్యాలయం నోటీసు బోర్డులో కూడా 5,9,14 వార్డు సభ్యుల పేర్లు క్రమ సంఖ్య తో సహా పేర్కొనడం జరిగిందన్నారు. మరసటి రోజు మధ్యాహ్నం అయ్యే సరికి తమ అభ్యర్థి వార్డ్ క్రమ సంఖ్య సరి లేదంటూ కుంటి సాకులు చూపుతూ తిరస్కరించారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల అధికారి ఒకసారి అభ్యర్థి వార్డు క్రమ సంఖ్య పేరును పరిశీలించి నోటీసు బోర్డులో అతికించిన తర్వాత ఎన్నికల బరిలో ఉన్నట్లుగా నిర్ధారించుకోవచ్చు అన్నారు, తిరిగి నామిషన్ పత్రాల్లో తప్పులు ఉన్నాయంటూ తిరస్కరిస్తే ఆ అధికారి ఎన్నికల నిబంధనల ప్రకారం పనితీరు ఎంత మెరుగ్గా ఉందో క్షుణ్ణంగా అర్థం చేసుకోవచ్చు అన్నారు.ఈ విషయంపై ఆర్డిఓ దృష్టి కి తీసుకెళ్లిన ఎలాంటి సమాధానం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఎన్నికల నిబందనలు పాటించి అధికారులు నిజాయితీగా పని చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.