దీక్షా దివస్ను విజయవంతం చేయాలి.. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన చారిత్రాత్మక ఉద్యమ పోరాట స్ఫూర్తిని చాటుతూ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర ఫంక్షన్ హాల్ లో అన్ని మండలాల ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దీక్షా దివస్ విజయవంతానికి దిశానిర్దేశం చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు...