📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరాజ్యాంగ హక్కుల పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యం

రాజ్యాంగ హక్కుల పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యం

📰 Generate e-Paper Clip

రాజ్యాంగ హక్కుల పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యం

ప్రజాస్వామ్య విలువలకు భంగం కలిగించే చర్యలను సహించం

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 26:

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని లిబర్టీ చౌరస్తా వద్ద భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కాకా వెంకటస్వామి విగ్రహానికి కూడా పూలమాల వేసి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం దేశ ప్రజలకు కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. గత 13 ఏళ్లుగా బీజేపీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ, రాజ్యాంగ వ్యవస్థలను బలహీనపరిచే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

పార్లమెంట్‌లో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌ను అవమానించే విధంగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తుచేశారు. అంబేద్కర్ పేరును ప్రస్తావించడంపై అవమానకర వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, వాటిని పార్లమెంట్ వేదికగానే కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా తిప్పికొట్టిందని పేర్కొన్నారు.

దేశంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కులు, పౌర స్వేచ్ఛ, సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 19, 20, 21 ద్వారా పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతం, సామాజిక న్యాయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.