📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపెండింగ్ పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలి

పెండింగ్ పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

పెండింగ్ పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలి

సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్

ఘనంగా టీఎన్జీవోస్ జిల్లా కార్యవర్గ సమావేశం

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి నవంబర్ 26

ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవోస్) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ డిమాండ్ చేశారు.

టీఎన్జీవోస్ పెద్దపల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశాన్ని గురువారం పెద్దపల్లిలోని ఐఎంఏ హాల్‌లో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలు, సంఘ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణ, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల సాధనలో టీఎన్జీవోస్ సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర సంఘం నాయకత్వంతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం కృషి చేస్తామన్నారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో నిర్వహించనున్న చలో ఢిల్లీ కర్మచారి ఆక్రోశ్ ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలని కోరారు. సంఘ ఆస్తుల పరిరక్షణ, సభ్యత్వ నమోదు, యూనిట్ల బలోపేతానికి ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని సూచించారు.

జిల్లా కార్యదర్శి అయిరెడ్డి సందీప్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై సంఘం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, వాటిని సంబంధిత అధికారుల, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. 2027 సంవత్సరానికి సంబంధించి టీఎన్జీవోస్ సభ్యత్వ నమోదు, ఉద్యోగుల గొంతుక సభ్యత్వం, డైరీ, క్యాలెండర్ నిధుల సమీకరణ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. జిల్లాలోని సంఘ ఆస్తులకు సంబంధించిన పత్రాలను భద్రపరచడంతో పాటు పెండింగ్‌లో ఉన్న యూనిట్ ఎన్నికలను నిర్వహించి ఖాళీలను భర్తీ చేయాలని తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం, సంఘ ఐక్యత, పారదర్శకమైన కార్యాచరణే సంఘ బలోపేతానికి పునాదులని పేర్కొన్నారు.

సమావేశంలో కీలక అంశాలపై చర్చ

సీపీఎస్ రద్దు కోసం చలో ఢిల్లీ కర్మచారి ఆక్రోశ్ ర్యాలీ నిర్వహణ, పెండింగ్ పీఆర్సీ అమలు, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) సమస్యల పరిష్కారం, సంఘ ఆస్తుల పత్రాల పరిరక్షణ, 2027 సంవత్సరానికి సభ్యత్వ నమోదు, ఉద్యోగుల గొంతుక సభ్యత్వం, టీఎన్జీవోస్ డైరీ, క్యాలెండర్ నిధుల సమీకరణ, పెండింగ్ యూనిట్ ఎన్నికలు, ఖాళీల భర్తీ తదితర అంశాలపై చర్చించారు. ఎల్-నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఐదు రోజుల పని విధానం అమలుపై కూడా తమ అభిప్రాయాలను వెల్లడించారు.

నూతన కార్యదర్శికి సన్మానం

సమావేశంలో జన్మదినం జరుపుకుంటున్న శివధర్మ తేజకు జిల్లా నాయకులు, కార్యవర్గ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పెద్దపల్లి పట్టణ నూతన కార్యదర్శిగా నియమితులైన చూప్పరి శ్రీనివాస్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు. నూతన బాధ్యతల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, పట్టణ యూనిట్ బలోపేతానికి చురుకుగా పనిచేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి అయిరెడ్డి సందీప్ రెడ్డి, అసోసియేట్ అధ్యక్షురాలు గోపు అనిత, వైస్ ప్రెసిడెంట్లు ఆడెపు శ్రీనివాస్, వీరగోని శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, స్వప్న కుమారి, జిల్లా సంఘ బాధ్యులు సంపత్, శ్రీధర్, అంజయ్య, రాజారత్నం, శివధర్మ తేజ, శిల్ప, సౌమ్య, స్వప్న, మంథని యూనిట్ అధ్యక్షుడు నూకల శంకర్, రామగుండం యూనిట్ అధ్యక్షుడు జగన్, పెద్దపల్లి రూరల్ కార్యదర్శి ప్రేమ్ సాగర్, టీఎన్జీవోస్ నాయకులు సందీప్ రావు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.