📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరాజ్యాంగం మన హక్కుల కవచం రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి

రాజ్యాంగం మన హక్కుల కవచం రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి

📰 Generate e-Paper Clip

*రాజ్యాంగం మన హక్కుల కవచం రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి*.

మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ జూపల్లి శశికళ రమేష్*

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 26

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట,77వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మున్సిపల్ చైర్‌పర్సన్ జూపల్లి శశికళ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ గొప్పతనాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థలో దాని ప్రాముఖ్యతను వివరించారు.

రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛ, న్యాయం కల్పిస్తూ దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాదిగా నిలుస్తోందని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కుల, మత, ప్రాంతీయ భేదాలు లేకుండా సమానత్వం, సోదరభావంతో ముందుకు సాగాలని అన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు ప్రతి పౌరుడు తన బాధ్యతలను కూడా గుర్తించాలని, భావితరాలకు రాజ్యాంగ స్ఫూర్తిని తెలియజేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రం, కాంగ్రెస్ నాయకులు జూపల్లి ప్రమోద్, తుమ్మ రాంబాబు, కౌన్సిలర్లు మిండా హరిబాబు, వెంకన్న బాబు, రవి, నార్లపాటి దివాకర్, నార్లపాటి రాంబాబు, సైదు బాజీ, కో ఆప్షన్ గౌస్ మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.