📄 ePaper
5pm
7pm
Thursday, November 26, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeఎడిటోరియల్ఝాన్సీ రెడ్డి నేతృత్వంలో సంవిధాన్ రక్షా మార్చ్ కు పాలకుర్తి దండు

ఝాన్సీ రెడ్డి నేతృత్వంలో సంవిధాన్ రక్షా మార్చ్ కు పాలకుర్తి దండు

📰 Generate e-Paper Clip

 

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ లక్ష్యంగా ఏఐసీసీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంవిధాన్ రక్షా మార్చ్ – రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజ్యాంగ పరిరక్షణకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) వద్ద ప్రారంభమైన ర్యాలీ నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కొనసాగింది. రాజ్యాంగ పరిరక్షణ సందేశంతో నిర్వహించిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ఆదేశాల మేరకు, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీకి తరలివచ్చారు. రాజ్యాంగ పరిరక్షణ నినాదాలతో ర్యాలీలో పాల్గొంటూ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరాన్ని ప్రజలకు చాటిచెప్పారు.

ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు రాజ్యాంగం కల్పించిన హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం వంటి విలువలను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం ఐక్యంగా ముందుకు సాగాలని నినదించారు. రాజ్యాంగ పరిరక్షణే ప్రజాస్వామ్య పరిరక్షణకు పునాది అని పేర్కొంటూ ర్యాలీ పొడవునా నినాదాలు చేశారు.

ఈ ర్యాలీలో ఏఐసీసీ ఇన్ చార్జ్ బి.ఎం. సందీప్ కుమార్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి టీపీసీసీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి ఝాన్సీ రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.