ఝాన్సీ రెడ్డి నేతృత్వంలో సంవిధాన్ రక్షా మార్చ్ కు పాలకుర్తి దండు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 26 (ప్రజావాణి):భారత రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ లక్ష్యంగా ఏఐసీసీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంవిధాన్ రక్షా మార్చ్ - రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజ్యాంగ పరిరక్షణకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం (లిబర్టీ) వద్ద ప్రారంభమైన ర్యాలీ నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు...