బెజ్జంకి క్రాసింగ్‌లో హరీశ్‌రావుకు బీఆర్ఎస్ శ్రేణుల ఘన స్వాగతం
బెజ్జంకి, నవంబర్ 26 (ప్రజావాణి)
బెజ్జంకి మండల పర్యటనకు విచ్చేసిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు బెజ్జంకి క్రాసింగ్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి, శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.అనంతరం భారీ కాన్వాయ్‌తో మండలంలోని వడ్లూరు గ్రామంలో నిర్వహిస్తున్న శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి హరీశ్‌రావు బయలుదేరి వెళ్లారు.మహోత్సవంలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రకృతి రమణీయత నడుమ విశాల ప్రాంగణంలో నిర్మించిన ఆలయం అద్భుతంగా ఉందని ప్రశంసిస్తూ,ఆలయ నిర్మాణానికి సహకరించిన దాతలను అభినందించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బెజ్జంకి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, యాదవ సంఘం బెజ్జంకి మండల అధ్యక్షులు స్వామి బిఆర్ ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు.

